Friday, 10 April 2020

               ప్రకృతి తీరు


తెల్ల మబ్బు తేరు పై
ఇలకు దిగిన చందమామ
ఎర్ర మబ్బు తేరు పై
ఇలకు ఓదిగిన సూర్యభామ
మీ ప్రేమే మా జీవము, లోకం

చందమామ, సూర్యభామ మీరే
మాకు గమనం మీ తోడే మా నేస్తం
భూదేవి ఆకర్షణకు,అనురాగానికి
మేము దాసోహం

మీ గమ్యం వైపు పయనించాలంటే
ఏవేవో....మరమ్మత్తులు జరగాలా...
వాటిని జరుపుకుంటూ మీ దగ్గరకు వస్తే
చందమామ అరచేయి అడ్డుపెడితే
సూర్యభామ మొండి కరముతో మాయ చేస్తే

ఇక మీ దరి చేరలేము
మనసును మభ్యపెట్టి మందలిస్తే గాని...
భూదేవి సువాసనను ఇస్తూ...
చందమామ చల్లని వాసననిస్తూ
సూర్యభామ తన వేడిసెగ వాసనను
ఎద జల్లుతుంటే...
మా జీవితాలు మీ ముగ్గురు సఖ్యత తో
తరించి పోతాయి
మీరు లేకపోతే మాకు మనుగడేది
ప్రకృతమ్మ.


డా.మున్నంగి. రాజకుమారి కాకాని
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్ అధ్యక్షురాలు

No comments:

Post a Comment