Saturday, 11 April 2020

             పెళ్ళా....మ్మా


అమ్మా.....?

నీ కష్టాన్ని,బాధ్యతను, నాకు తరతరాల
ఆస్తిగా,ఆభరణముగా  ఇచ్చావా
నా బుజ్జి హృదయాన్ని తట్టి చెప్పావే

బుజ్జి....!

నా బరువు బాధ్యత నీవేననీ
నేను చేసిన పాపమేంటి....?
నేను పుడుతూ  ఏడ్చాను
జీవిస్తూ ఏడుపే
మరణిస్తూ దుఃఖమే

ఎదమ్మా....సుఖం,
బ్రహ్మ మరిచాడా...విధిరాత కాకపోయినా
తల రాతను మార్చుతావని ఆశ పడ్డ
ఆశ ఆవిరై, ఆకాశాన్ని అంట లేదు
భూమిని చేరలేదు

మధ్యలో నీవు రాసిన రాతకు
విలవిలాడాను
అమ్మా....పెళ్లి చేసుకున్నావు బిడ్డను కన్నావు
ఏమి సౌఖ్యం దొరికింది... తల్లి...
జీవితం మారిందా
ఆడ తనపు భావాలు మారాయా
బెదిరింపులు మారాయా...

కష్టాల ఊబిలో నన్ను నెట్టావు
నీవేమి సుఖ పడ్డావు...మాతా..?!

నేను ఎవరికి బరువు
నీకా...సమాజానికా...భూమికా..
చెప్పవే తల్లీ... చెప్పు...

పెళ్లి చేసుకోకపోతే
ఆడ జన్మ మారుతుందామ్మా
అమ్మ తరువాత అమ్మ ,అమ్మమ్మా
ఇదేనా అమ్మా... ఆడ జన్మ..అమ్మరాత
ఆడ జన్మ వాత..

నీ బ్రతుకు శున్య మాసం..
నా బ్రతుకు అమావాస్య  కాళరాత్రి..
ఇవే మన కాళరాత్రి మహమ్మారి
ఆడ జీవితాలు.


డా.మున్నంగి. రాజకుమారి కాకాని
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్ అధ్యక్షురాలు.

Friday, 10 April 2020

               ప్రకృతి తీరు


తెల్ల మబ్బు తేరు పై
ఇలకు దిగిన చందమామ
ఎర్ర మబ్బు తేరు పై
ఇలకు ఓదిగిన సూర్యభామ
మీ ప్రేమే మా జీవము, లోకం

చందమామ, సూర్యభామ మీరే
మాకు గమనం మీ తోడే మా నేస్తం
భూదేవి ఆకర్షణకు,అనురాగానికి
మేము దాసోహం

మీ గమ్యం వైపు పయనించాలంటే
ఏవేవో....మరమ్మత్తులు జరగాలా...
వాటిని జరుపుకుంటూ మీ దగ్గరకు వస్తే
చందమామ అరచేయి అడ్డుపెడితే
సూర్యభామ మొండి కరముతో మాయ చేస్తే

ఇక మీ దరి చేరలేము
మనసును మభ్యపెట్టి మందలిస్తే గాని...
భూదేవి సువాసనను ఇస్తూ...
చందమామ చల్లని వాసననిస్తూ
సూర్యభామ తన వేడిసెగ వాసనను
ఎద జల్లుతుంటే...
మా జీవితాలు మీ ముగ్గురు సఖ్యత తో
తరించి పోతాయి
మీరు లేకపోతే మాకు మనుగడేది
ప్రకృతమ్మ.


డా.మున్నంగి. రాజకుమారి కాకాని
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్ అధ్యక్షురాలు

Wednesday, 8 April 2020

వయసు ప్రభావం


బాల్యమంత బంతి పూల తోట
వనంలో అమ్మ అనేచెట్టుకు
అంటూ కట్టు జీవితం
 5 -–సంవత్సరాల ప్రాయం ప్రమాదకర జీవితం
ఏది మంచి ఏది చెడు తెలియని ప్రాయం
7 -– ఏళ్ళ ప్రాయం ప్రాణభయం
ముద్దు ముద్దు మాటలతో చక్కగా చదివే వయసు
విరబూసిన గులాబి లా
పదుగురి దృష్టి తన మీదే
10 -–వత్సరాల ప్రాయం అమ్మ మంచి, చెడు
 ఈడు  ఎదో చెయ్యాలని బాగా చదవాలని ఆతృత
జోడి పిల్లలతో ఈల నేర్చుకుంటూ
తల్లితండ్రులను ఆశ్చర్యచకితులను చేస్తారు
కొన్ని విద్యలను నేర్చుకొని

12 --వత్సరాల ప్రాయం పనిగట్టుకు పిలుస్తుంది
ప్రకృతి , ఈడు వచ్చిందని
16 --సం ౹౹ ప్రాయం  సమాజంతో సంబంధం లేక
ప్రకృతితో చెలిమి ,ఆరాధికులను ఆహ్వానించుట
చెట్టా పట్టా లేసుకు తిరుగుట,విద్య నిర్లక్ష్యం
దేనినైనా సాదించ గలమనే ధైర్యం

21 -- సం౹౹ రాల ఈడు మానవత్వపు
ఆలోచనలు మది నిండు,మంచి చెడు కష్టం సుఖం తెలిసిన ప్రాయం జంటకు ఆహ్వానం పలుకుతుంది ఎదురు చూపు తో...

25-- సం౹౹ రాలకి భవిష్యత్ ప్రణాళికలు
సంతానానికి తయారు
30-- వత్సరాలకే సంసార సాగరాన్ని
ఈదలేక అతలాకుతలం

40--వత్సరాలకు బ్రతుకు బాధ్యత లతో
సతమతం అవ్వడం
45--వత్సరాల ఈదే బ్రతుకును అర్థవంతంగా ఆలోచించి
మంచి చెడులను బిడ్డలకు చెప్పే వయసు
49--వత్సరాల మంచిని మమతను కలబోసి
గృహాన్ని స్వర్ణసీమ చేస్తూ  వడ్డీ అనే బిడ్డ మమకారాలతో

52--వత్సరాల మీద పడుతున్న వయసు ఛాయలు
వృద్ధాప్యాన్ని ఆహ్వానిస్తున్నా ప్రకృతమ్మ
57-- వత్సరాల పదవి విరమణ
పలకరిస్తుంది  విశ్రాంతిని కోరు అని
60-- వత్సరాల,కాల గమనంలో కలిసిపోయిన
గత  జ్ఞాపకాలను నెమరు వేస్తూ
షష్ఠి పూర్తి ఉత్సవానికి ఆహ్వానం

70--వత్సరాల మానసిక స్థితితో మగ్గిపోవడం
గొడ్డలై నరకడం బ్రతి కుంటామన్న భరోసా లేదు
80--వత్సరాలు  బ్రతి కుంటే  పరమాత్మ  ప్రసాదమే
గతించిన జీవితానికి గమ్మతైన మర్మాల జీవితం
పరమాత్మ లో లీనం.

ఇదే వయసు పిలిచే పలికే జీవితం!
మాయ జీవితం !  మట్టి జీవితం !.


డా.మున్నంగి. రాజకుమారి  కాకాని.
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్ అధ్యక్షురాలు.




Saturday, 4 April 2020

        అమ్మ

కడిగిన ముత్యంలాంటి
కాలానికి ఎదురీత తల్లి

ఆ  జీడి కాయలాంటి కడుపులో
ఆ- అర అరల్లో పోషణ నిచ్చి పెంచింది అమ్మ

కడుపులో ఉన్న నాకు
ఊసులెన్నో చెప్పింది జనని
వాసనలు ఎన్నో చూపింది అమ్మ

వానలో ఎలా ఆడాలో నేర్పింది తల్లి
కష్టానికి ఎలా బాధపడాలో నేర్పింది అమ్మ
సుఖానికి ఎలా సంతోషించాలో తెలిపింది అమ్మ

సూర్యుడి నుండి ఎలా
కాపాడుకోవాలో తెలియజేసింది అమ్మ
చల్లదనంలో ఉల్లాసాన్ని నేర్పింది తల్లి

ఎలా ఏడ్వాలో ఏడ్చి నాకు నేర్పింది అమ్మ
ఎలా నవ్వాలో నవ్వి నాకు నేర్పింది తల్లి

సమాజంలో తెలివిగా ఎలా మెలగాలో
కడుపులోని అంకురార్పణ చేసింది అమ్మ

అమాయకులను ఆదుకోవడం నేర్పింది అమ్మ
సహాయం చేసే గుణాన్ని నేర్పింది తల్లి

పుడమిపై పడేటప్పటికె పూజ చేసింది అమ్మ
ఇదే పుట్టుకకు ముందు నేర్పిన పాఠం
అమ్మ నాకు నేర్పిన గుణపాఠం..


డా మున్నంగి. రాజకుమారి  కాకాని
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్
అధ్యక్షురాలు.

Tuesday, 31 March 2020

                                            రోడ్లు (ప్రయాణం)




జీవిత ప్రయాణం చాలా విలువైనది
మధురానుభూతుల
సమేళనమే ప్రయాణం
ఊరు ఒకటే ఊరు పేరు ఒకటే
కానీ...రోడ్లు మా దృష్టి కి తికమకం

ఒకప్పటి ఊరు రోడ్లు
ఆహ్లాదాన్ని,ఆనందానిచ్చాయ్
అమ్మమ్మ అనురాగాన్ని
తాతయ్య  తన్మయత్వాన్నీ గుర్తు చేస్తూ


రోడ్లన్నీ తెలిసినవే 
ఆప్యాయత, అనురాగాలా
ఆ రోడ్లు వేకువజామున
కమ్మటి వాసనను వేదజల్లెవి
చెప్పుల్లేకుండా  చెట్టాపట్టాలేసుకుని
మమకారమైన ముచ్చట్లు చెప్పుకుంటూ
నడి రోడ్డుపై నవ్వుకుంటూ నడిచేవారు

ఆనాటి రోడ్లు రోగాన్ని నివారించేవి
సుతి మెత్తని మనసువంటి రోడ్లు
 ప్రాణం నిలిపేవి, హాయిని గోలిపేవి..


ఈనాడు రోడ్లు కనిపించడంలా
పెద్ద పెద్ద కొండ శిఖరాల్లా
10 అంతస్తులు 15,20, అంతస్తులు
దర్శనమిస్తూ...
రోడ్లెక్కడ ఇల్లెక్కడ
గుర్తు పట్టలేని పరిస్థితి
వీధి గుర్తుంటే ఇల్లుగుర్తెక్కడ...?


రోడ్లపై ఇళ్లు చూస్తే
స్మశానములో శవాల గుర్తుల్లా ఉన్నయ్
రోడ్లపై కాలు పెట్టలేం
కర్కశత్వాన్ని చాటుతున్నాయ్
రోగాన్ని విస్తృతం చేసాయి
మనిషి మనసును మార్చయి
హృదయాన్ని రాయిని   చేశాయి
ప్రాణం తీస్తాయి నేటి రోడ్లు..

రోడ్డుకు, రోడ్డుకు ఎంత వ్యత్యాసమో
మనిషి జీవితానికి ,జీవితానికి అంత వ్యత్యాసం..



డా.మున్నంగి. రాజకుమారి కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు...!!!



Sunday, 29 March 2020


                                                      మనిషి తీరు..


నాడు నేడు


మనిషి తీరు..



ఎండకు  ఎండడం
వానకు   తడవడం
చలికి     వణకడం

మంచుకు   నీలక్కపోవడం
మమతకు  కరిగిపోవడం
కోప మనసుకు   రగిలిపోవడం



నిరాశ,అశాంతికి   కృంగిపోవడం
సుఖ సంతోషాలకు   పొంగిపోవడం
ఆస్తి,అమ్మకానికి   అడుక్కోవడం
తాళి తెంచడానికి   చితికిపోవడం

మనిషిని చంపితే  ప్రాణం ఎగిరిపోవడం
మానవుని తీరు   మార్చుకోవడం



మానవత్వాన్ని   పెంపొందించుకోవడం
సమాజ   హితంకోరడం
ఇవన్నీ మంచి మనిషికి  నిదర్శనం

నాడుఅయిన నేడు అయిన  
ఎపుడైనా మనిషి తీరు ఒకటే.


డా.మున్నంగి. రాజకుమారి కాకాని.
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్
 అధ్యక్షురాలు..!!

Thursday, 26 March 2020

                             పెళ్లిళ్లు..



నాడు..



పెళ్లిళ్లు అంటే
ఆడ, మగ,
సిగ్గులు మొగ్గలై

ఆనంద పరవశంలో
కుటుంబాలు ,బంధువులు, స్నేహితులు
పరులు,పామరులు అందరిలో
సంతోషాలు ఝరీ ప్రవాహంలా
వెల్లి విరిసేవి..

ఆ రోజుల్లో ఆడపిల్లకు
నచ్చిన నచ్చకపోయేనా
కాసులిచ్చి కన్యాదానం చేసుకునేవారు

60 యేళ్ళు అయినా,20 యేళ్ళు అయినా
పెద్దలు చెప్పినట్లు ఇష్టమున్న లేకున్నా
 భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరి వేసి

పెద్ద పెద్ద మైక్సౌండ్స్ పాటలు
హరికథలు బుర్రకధలు..

వధువును పల్లకిలో
మేళతాళ్లాలతో
రంగ రంగ వైభవంగా
ఆనాటి వెళ్లిళ్ళు ఆసక్తిగా

అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి
ఏడు వారాల నగలతో నాట్యం చేస్తూ
చేయిస్తూ తాళి కట్టి తన దాన్నిగా
చేసుకునేవారు ఆ నాటి వివాహాలలో..

నేటి..



పెళ్లిళ్లు
కట్నాలు, కానుకలు, మేడలు,చదువులు
ఉద్యోగాలు, జీతభత్యాలు, లావాదేవీలు..

అమ్మాయి ఎలా ఉంది అనే దానికంటే
ఎంత కట్న కానుకలు తెచ్చింది
ఎన్ని కోట్లు వెంట తీసుకొచ్చింది
అనేదే గొప్ప

ప్రేమ పెళ్లిళ్లు అయిన డబ్బుతోనే
వ్యవస్థ అంత ముడిపడుతుంది

కుంటివాలైన,గుడ్డివాలైన,
చెవిటివాలైన, చాందసులైన
కాసుకు కాదేదీ అనర్హం
నేటి వివాహా వ్యవస్థ ధోరణి.


డా.మున్నంగి. రాజకుమారి  కాకాని.
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్
 అధ్యక్షురాలు..!!!


Wednesday, 25 March 2020

              Hantavirus Pulmonary Syndrome (HPS)

                #Hanta #Virus Hulchul in #China ..


                                                                   

చైనాలో కొత్త వైరస్..!!

Hantavirus Pulmonary Syndrome (HPS)

Hantavirus Pulmonary Syndrome (HPS) is a severe, sometimes fatal, respiratory disease in humans caused by infection with hantaviruses.
Anyone who comes into contact with rodents that carry hantaviruses is at risk of HPS. Rodent infestation in and around the home remains the primary risk for hantavirus exposure. Even healthy individuals are at risk for HPS infection if exposed to the virus.
To date, no cases of HPS have been reported in the United States in which the virus was transmitted from one person to another. In fact, in a study of health care workers who were exposed to either patients or specimens infected with related types of hantaviruses (which cause a different disease in humans), none of the workers showed evidence of infection or illness.
In Chile and Argentina, rare cases of person-to-person transmission have occurred among close contacts of a person who was ill with a type of hantavirus called Andes virus...

Tuesday, 24 March 2020


                                                       లోనా కరోనా..!!


కరోనా మహమ్మారి
ప్రపంచ దేశాలను
వణికిస్తూ  
వదలనంటుంది

నేలపై తిరిగే జంతువులను
భూమి పై  ప్రాకే విష సర్పాలను
మనుషులు వేటిని ముట్టుకుంటే చనిపోతారో
వాళ్ళ ...దుంపతేగా
వాటినే ఆహారంగా 
భుజిస్తే... కరోనా 
ఏమి కర్మ. .కిరొమా కు
వస్తోంది...

కరోనా దెబ్బకు
మనుషులు హౌస్ అరెస్ట్
అంటున్నారు గాని
మనసు అరెస్ట్ చేసుకొని
మనుషులెవ్వరు

ఒక ప్రక్క కుటుంబ మంత
కలిసున్నామన్న ఆనందము
కంటే 
కరోనా రాకుండా చూడు
భగవంతుడా అనే
బాధ ఎక్కువగా ఉంది

కర్ఫ్యూ లు, 
కదలలేని మనుషులు
స్వచ్ఛ మైన గాలి 
పిల్చాలి అనుకుంటే
గాలిలో వ్యాధి సోకుటుందేమో
సూర్యుడు వైపు చూద్దామంటే
భగ భగ మండుతున్నాడు
కరోనా వచ్చిన మనిషిలా

మనుషులకు దరి తోచని
పరిస్థితి 
కుప్పలు తెప్పలుగా పడున్నా
శవాలకు దహనసంస్కారాలు
ఎక్కడ...
కుళ్లుతో కంపు కొడుతున్నా
శవాలనైనా మింగేస్తారు

కరోనా తెచ్చిన ప్రాంతాల వాళ్ళు.
జర భద్రం  ప్రజానీకమా...


డా .మున్నంగి.రాజకుమారి  కాకాని.
డా.ఆర్.మున్నంగి .ఫౌండేషన్

అధ్యక్షురాలు...!!!

Monday, 23 March 2020

 
                                                 

                    ఉమ్మడి కుటుంబం...


నాడు  ..

ఉమ్మడి కుటుంబం
అంటే మమతానురాగాలకు
ఆప్యాయతలకు ప్రేమలకు పుట్టినిల్లు

ధనానికి విలువ ఇవ్వనిరోజులు
ప్రేమలు సమృద్ధిగా ఉన్నరోజులు

సరదా పల్లెటూళ్ళు
సరదా సరదా నవ్వులాటలు
కావాల్సినన్ని కుళ్లు జోక్స్

అవ్వలు, తాతలు 
పిన్నులూ బాబాయ్ లు
ఆమ్మలు  పెదనాన్నలు
అన్నలు తమ్ముళ్లు
అక్క చెల్లెళ్లు ,
బావలు మరదళ్లతో 
పండుగలకు పబ్బాలకు
ఆడుతూ పాడుతూ
కావాల్సినంత కమ్మని నవ్వుతో
ఉమ్మడి కుటుంబాలు ఆహ్లాదకరముగా ఉండేవి 

నేడు..!!



నేడు కుటుంబాలు
ఒంటరి తనంతో 
ఒళ్ళంతా ఒయ్యారాల తో
బిక్కుబిక్కుమంటూ
ప్రక్కటేముకలు 
సలుపుతున్నా బాధ తో
బండబారిన హృదయాలతో
బాధ్యతలు మరిచి 
బంధాలు అదమరిచి
నిద్రిస్తున్నా రోజులు

మమకారాలు అనురాగాలు
తల్లిదండ్రుల పట్ల  ఆప్యాయత
బంధువుల పట్ల అనురాగం
పెద్దలంటే భయభక్తులు
చిన్నలంటే ప్రేమాను రాగాలు 
నేడు  కుటుంబాలు
స్మశానంలో  శవాలైనాయి  

ఎక్కడెక్కడో వెలివేత బ్రతుకులు 
కొండ మీద బండ రాయిలా
మమకారానికి
సమాధి చేసిన రోజులు నేడు


డా.మున్నంగి. రాజకుమారి కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!

Sunday, 22 March 2020

                                                          చదువులు.. 
నాడు..

చదువులు
గురువంటే భక్తి
గురుకులాలంటే ఆసక్తి
అక్షరాలను,  క్రమశిక్షణ ను
నేర్పించే గురువులు
అన్నాడు

అక్ష అక్షరానికి గురువుకు
ప్రదక్షిణ చేసి నేర్చుకునేవారు
గురువు మాటంటే వేదం

గురువును తల్లిదండ్రుల కంటే
ఎక్కువుగా ప్రేమించేవారు
కొట్టినా తిట్టినా తమకోసమే
అనుకునేవారు.సహించేవారు

కర్మ కాలి తల్లికి 
గురువు పై చాడీలు చెబితే
నీకోసమెగా ..నీకు చదువు
కోవాలని లేదా...?
అని అమ్మ  గురువు కంటే
ఎక్కువగా కొడుతోంది
తిడుతుంది...

మాస్టారు...మా పిల్లలను
బాగాకొట్టి చదువు నేర్పించండి
అనేవారు ఆనాటి తల్లులు.

కష్టమొచ్చినా ,కన్నీరొచ్చినా
గురువుగారే  అమ్మకంటే
మంచ్చోళ్లు అనుకునేవారు

ఆరోజుల్లో డబ్బు ప్రదానం
 కాదు...మాటపైన నిలబడే నమ్మకము ప్రదానం.

నమ్మితే ప్రాణమిచ్చేరోజులు
గురువు కోసం  ఏదైనా
సాహసంతో ప్రేమతో
చేసేవారు...

గురువు గారు సినిమా
చూడండిరా అంటే 
మాస్టార్ మీరు వస్తే పోతాము
అనేవారు.  సరదా చేయండి
అంటే మీరే గురువు గారు
మా సరదా అనేవారు

కోడితేనే చదువస్తుంది
భయముంటే భద్రత
వస్తుంది

గురువంటే ప్రాణాలిచ్చే వారు
గురువుకు శిష్యులకు

మద్య  స్నేహాలు అమోఘం
 అనిర్వచనియ్యం అన్నాడు...

నేడు..


చదువు అమ్ముడుపోయి
అంగడి సరుకుల మారింది

గురువంటే భయంలేదు
చదువంటే మమకారంలేదు

డబ్బు పోసికొంటే 
పట్టాలు (సర్టిఫికెట్స్) కోకొల్లలు

చదువొచ్చినా రాకపోయినా
డబ్బుంటే చాలు చదువు
అదే వస్తుంది అంటారు

కొట్టకూడదు తిట్టకూడదు
చదువు శుభ్రం రావాలి 
భయం లేకుండా చదువు
చెప్పండి అంటారు

గురువులపైన జోక్స్ వేసుకుంటూ  తిట్టుకుంటూ
బెదిరిస్తూ ,బయపెడుతూ 
భజనలు చేస్తుంటారు
నేటి శిష్యులు

అల్లరిచిల్లరి వేషాలు 
కావాల్సినన్ని కబుర్లు
ఆట పట్టించే అల్లరితనము
నేడు శిష్యులకు అలవాటైపోయేంది..

నేడు గురుశిష్యల మధ్య
సంబంధాలు వేశ్యల కొంపలా
తయారైనవి

నేడు చదువంటే 
మత్తుపానియలు 
శృంగారనైషదాలు
సినిమాలు,షికార్లు
ఇది ఇప్పటి చదువులు

ఇష్టమైతే చదువుకోవడం
కష్టమైతే కాసులు పోసి
చదువు కోనుక్కోవడం
నేటి యువత ప్రపంచమైంది


డా.మున్నంగి. రాజకుమారి కాకాని.
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్

అధ్యక్షురాలు..!!!

Saturday, 21 March 2020

కరోనా..!! [Corona Virus]..


                                                          కరోనా..!!


కరోనా ఒక సెలబ్రిటీ
ఎవరి నోటన విన్నా
ఉలిక్కి పడటం
భయపడటం,
విచారపడటం

కట్టలు కట్టలు కూడబెట్టాలని
కట్టలు పోసి  ఖండాంత రాలు
దాటించ్చాము
కణం కణము చొచ్చుకుపోయే
మనిషికి కనిపించనంతగా
యంత్రాలకు కనిపిస్తుంది గాని
మంత్రాలు చెప్పే మనిషికి కనిపించడంలా

మన అవయవాలను 
మనము  తాకలేక
మదనపడుతూ
కౌగిలించలేక,కరచాలనం
చేయలేక
వెలివేత బ్రతుకులైనాయ్

కులం,వర్ణం,వర్గం అన్ని వదలి
తల దాచుకోడానికి చోటెక్కడా
అనే భావన జనాన్ని

అతలాకుతలం చేస్తుంది ..


కరోనా సెలబ్రిటీ
ఒక్క కణము చాలు
సమస్తదేశాలను
సముద్రంలో నావలా
ఊగిసలాడిస్తూ
ఎలివేతలు,ఎత్తివేతల
బ్రతుకులైనాయ్ 
నేటి సమాజం.

ఒకప్పుడు కలరా ,సైన్ ఫ్లూ,
సునామీ సగం జనాన్ని
నీటి మట్టము చేసింది
ఇప్పుడు కరోనా.
తినే ఆహారపుఅలవాట్లలో
గుణాలు ఉన్నట్లు..
గాలి ,కలుషితము,నీరు కలుషతము
మనిషి జీవన విధానమే
కలుషిత
ఖండాంత రాలు దాట్టి
వచ్చిన కరోనా 
వణికిస్తోంది సమాజాన్ని.


డా.మున్నంగి. రాజకుమారి కాకాని
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్

అధ్యక్షురాలు..!!
             
                                                          మగాళ్లు..!!
నాడు..


ఒకప్పటి  మగాళ్లు
మర్మం ,కర్మము
ఎరుగని వాళ్ళు

ఇతరులకు
సహాయం చేయడమే
తమ లక్ష్యంగా
పెట్టుకునే వాళ్ళు

ఎవరైనా అపదల్లో
ఉంటే మేమున్నాం
అనేవాళ్ళు..

ఎలాంటి  ఆంక్షలు
లేకుండా ఎలాంటి
లబ్ది లేకుండా 
ఇతరులకు
సహాయ పడే వాళ్ళు

మానవత్వమే 
తమ లక్ష్యం గా
బావించేవాళ్ళు

పక్కని వాడి బాధ
తమ బాధగా భావించే
వాళ్ళు

అవసరమను కుంటే
వెన్నంటి ఉండేవాళ్ళు
భుజం తట్టి మేంమున్నాము
అనే వాళ్ళు

పక్కన ఆడపిల్లకు
అన్యాయం జరిగితే
రక్షించడానికి
సిద్ధంగా ఉండేవాళ్ళు
అవసర మనుకుంటే
వంద మందిని
పోగేసేవాళ్ళు

అన్యాయాలు,అక్రమాలు తెలియని మగాళ్లు

యుద్ధానికైనా,
విప్లవానికైనా
ముందుండి 
నడిపించేవాళ్ళు

సమాజంలో ఏ వ్యక్తి
బాధ పడకూడదు
చేతనైనంత వరకు
రక్తం చిందించైనా
నా మనుషులకు
 మానవత్వంతో
సహాయం చేయాలి

కులాలు మతాలు 
పక్కన పెట్టి 
ప్రేమ,ఆప్యాయత
మంచి, తనంతో 
ఇతరులకు సహాయం
చేస్తే 
రేపు భగవంతుడు
నాకు నా కుటుంబానికి 
మేలు చేస్తాడు
అని బావించేవాళ్లు

అరమరికలు లేని
అమాయకులు

ఆనాటి మగాళ్లు..

నేడు..


మాగాళ్ళు
మానవత్వం లేని
నికృష్టులు
కామంతో కళ్ళు ముసుకు
పోయినా కబోదులు

మేలు చేసే గుణం 50%
కూడలేనివాళ్ళు
నా మనుషులు
నా కులాలు
నా వర్ణాలు
నా జాతులు అని
స్వార్థం తో తిరగటం
బాధ్యత గా పెట్టుకునేవాళ్ళు

పక్క వాడు చస్తున్నాడు
అంటే..అవునా...అని
హేళన చేసి ...కళ్ళు తెరచి
చూసే రకం నేటి మగాళ్లు

పోకిరి మగాళ్లు 
ఈ రోజులలో ఎక్కువగా
ఉన్నారంటే అతిశయోక్తికాదు

బంధాలకు విలువ
లేని రోజులు
అక్రమాలకు
తావున్న రోజులు
అన్యాయాన్నీ
రెచ్చగొట్టే రోజులు

ఏ పని చేయాలి అన్నా
డబ్బు,డబ్బు,డబ్బు
డబ్బుతో ముడిపడిన
జీవితాలు 
నేటి మగాళ్లు..!!


డా.మున్నంగి. రాజకుమారి కాకాని
డా.ఆర్.మున్నంగి

ఫౌండేషన్ అధ్యక్షురాలు..!!
                                                                 
                                                            బాలికలు..
నాడు ..


బాలికలు
పుష్ప వనాలలో
విరబూసే,గుబాలించే
తెల్లనైనా మల్లెలు
గులాబిలు,జాజిలు
చేమంతులు, బంతులు
కనకంబరాలు,లిల్లీలు
మరువం, మాసిపత్రి
పువ్వులు లా,ఆకులు లా
 పరిమళాన్ని వెదజల్లే స్వచ్ఛమైన మనసు.

తల్లిదండ్రి పిలిస్తే 
లేడి పిల్లలా 
పరుగులు పెడుతూ
వచ్చి వాలుతుంది

అమ్మ .........! 
పిలిచావా
ఏదైనా పని చేయమంటావా
అని తల్లి చేతిలో పనిని
తన పనిలా లాగేసుకుంటుంది

పెద్దలంటే గౌరవం తో
చిన్నలంటే మమకారంతో
వరుసైనా వారితో
వయ్యారంగా
తాతలు అవ్వ లతో  
అనురాగంగా, ప్రేమగా
అందరితో కలిసిపోతూ,

కవ్విస్తూ,నవ్విస్తూ
కమ్మని కబుర్లు చెబుతూ
విశాలంగా కావాల్సినంత
సంతోషంగా ఆడుతూ,పాడుతూ
అందరిని అలరిస్తూ
జీవితాన్ని నందన వనం
చేస్తుంది

అమ్మ చెప్పిన విధంగా
బట్టలు వేసుకుంటూ
కాటుక,బొట్టు,పెట్టుకుంటూ
జడలు అమ్మకు నచ్చినట్లు
వేయిoచుకుంటూ

మెడలో గొలుసు 
చేతికి గాజులు
కాళ్లకు పట్టీలు పెట్టుకుని
పుత్తడి బొమ్మలా
బయలు దేరే బిడ్డను
 నా బంగారుతల్లికి
ఏ దిష్టి తగుల కూడదు
అని దీవించి పంపేది

ఆడ పిల్ల అంటే ఇలా
ఉండాలి అనే విధంగా 
ఉంటుంది
నాటి బాలిక...

          నేటి..


బాలికలు  బద్ధకస్తులు
గులాబీ కొమ్మకు ముళ్లులా
ఎప్పుడు ముక్కు మీదే
కోపం తెచ్చుకుంటూ..

చిట పట లాడుతూ
కొరకొర చూస్తూ 
పళ్ళు కొరుకుతూ
గుటకలు వేస్తూ
మేటికలు విరుస్తూ
నన్నే పిలుస్తారు

ఎప్పుడు నేనే
చేయాలా పనంతా
అంటూ  నిట్టూర్పులు
విరుస్తూ జీవిస్తుంటారు

ఇక తాతలు,తండ్రులు పిలిస్తే
ఎప్పుడు నన్నే పిలుస్తారు
ఏమి పని బాట ఏమీలేదు
అనుకుంటూ మనసులో
తిట్టుకుంటూ 
మాటంటే ఏడుస్తూ ..
జీవితాన్ని  వెళ్లదిస్తుంటారు

మమకారాలు
మర్యాదలు ,మౌనాలు
సంతోషాలు  ఇవేమీ
ఉండవు..

స్వార్ధ ప్రపంచములో
సోంబేరుల్లా పెంపకాలు
జరుగుతు దోషాలను
 పెంచుతున్నాము

స్వార్థంగా జీవించమని
చెప్పకనే మీడియా 
ద్వారా చేరవేస్తున్నాం
చూపిస్తున్నాం

ఏంటి అని అడిగితే
మీరు అవసరాలు తీర్చే
యంత్రాలే  అంటున్నారు
నేటి బాలికలు.

మమతలు మమకారాలు
అనురాగాలు ఆప్యాయత
ఇవేమీ లేవు 

వినే స్టేజి పోయి
వివరించే స్టేజి కి
వస్తోంది

ప్రపంచమే స్వార్థం. .
మేము ....స్వార్థమే అంటుంది
నేటి యువత


డా.మున్నంగి. రాజకుమారి కాకాని.
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!


Friday, 20 March 2020


                   అక్క  తమ్ముడు..!!!


నాడు..!!



అక్క అంటే 
తమ్ముడికి 
యనలేని మమకారం..

అక్క 
నోటి నుంచి
ఏదైనా మాట
వస్తే బాగుండు

అక్క నేను ఉన్నా
నాకు చెప్పు చేస్తా
అనే తమ్ముళ్లు
ఒకప్పుడు కొకోల్లలుగా
ఉండేవారు..

అక్క ఎంత 
పెద్ద పని చెప్పినా
నా బాధ్యత
అని భుజాలపై
వేసుకునే తమ్ముళ్లు
అన్నాడు..

నీకు ఏ కష్టం
రాదక్క నేనున్నా
అనే రోజులు
ఆనాడు..

తమ్ముళ్లు ఉండేది
అక్క అవసరతలు
తీర్చడానికే

తల్లిదండ్రులు
లేకపోయినా
నా తమ్ముడు అన్ని
తనే అయి చేస్తాడు
అని మురిసిపోయేది
 అక్క

నా అక్కే నా ప్రపంచము
అనుకునే వాడు
ఆనాటి తమ్ముడు

అక్కకు 
కష్టం వచ్చినా
కన్నీళ్లొచ్చినా
భరోసా ఇచ్చేవాడు
అక్కకు వెన్నంటి 
ఉండేవాళ్లు

ఆనాటి తమ్ముళ్లు..!!!

               నేడు..!!



తమ్ముడు అంటే
తుమ్మితే ఊడిపోయే
ముక్కు సామెత.

అవసరతలు తప్ప
ఆప్యాయతలు
అనురాగాలు  లేవు

అక్కకు వెన్నంటి
ఉండాలంటే 
ఎవరుంటారు
నా పనులు నాకు
లేవా అనే తమ్ముళ్లు
ఈ నాడు

ఎవరి అవసరతలు,
ఎవరి పనులు వారికి
వుంటాయి అనే
స్వార్ధ పూరిత మైన
మనసు నేటి తమ్ముళ్లు

నేనేనా నాలాంటి
తమ్ముళ్లు చాలా మంది
ఉన్నారులే
  అని
ఈర్షతో చెప్పే
తమ్ముళ్లు ఈరోజు లల్లో
లేకపోలేదు

స్వార్ధ ప్రపంచంలో
కల్మషమైనా మనసులు
గల తమ్ముళ్లు 
ప్రస్తుత సమాజంలో
లేకపోలేదు

అక్కలకు
మేలు చేసే తమ్ముళ్లు
ఈరోజు లలో
చాలా అరుదనే
చెప్పుకోవాలి

ఏ బంధాలైన 
ఆర్థిక  సంబంధాల తో
ముడి పడుతున్నా
రోజులు నేడు

ఆప్యాయత లు
మమకారాలు 
అనురాగాలు
ఏ నాడో 
భూస్థాపితమైనవీ

అనురాగాల 
ఉయ్యాల లో
ఊగిసలాడుతున్నా
బంధాలు
 నేడు
శున్య మనే చెప్పాలి..!!



డా.మున్నంగి. రాజకుమారి కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!!

Thursday, 19 March 2020


                        అన్నదమ్ములు..!!

     నాడు.!!




అన్నదమ్ముల అనుబంధము
అమృతంలా,
చేరకురసంలా. 
పాలలా, 
స్వచ్ఛంగా ఉండేది

అనురాగంలో,ఆప్యాయంగా
ఆవేశంలో సౌమ్య గా
అభిమానంలో  ఆలింగనం చేసుకునే వాళ్ళు

కష్టాలలో ఆదుకుంటూ
కన్నీళ్లలో తోడుంటూ
 అభిమానానికి,ప్రేమకి అవధులు లేని బంధం

అవసరాలలో ఒకరికి ఒకరు
తోడు నీడలా,
కంటికి తోడుండే నీటిలా
అద్దం ముందుండే ముఖంలా
ఆదుకుంటూ కాపాడుకుంటూ
ఏముకలకు అంటిపెట్టుకున్నా
శరీరంలా
నాడు అన్న దమ్ముల బంధం అలా ఉండేది..

నేడు..!!



బంధాలకు విలువలు లేని జీవితం ..
అన్న దమ్ముల అనురాగం లేని
జీవనం

ఆర్థిక  స్వేచ్ఛను కోరుకునే 
జనం
ప్రేమలు,ఆప్యాయతలకు
సమాధి కట్టినరోజులలో
అన్న దమ్ముల అనురాగమెక్కడిది

అన్న తమ్ముడు 
కష్టాల్లో ఉంటే ఆదుకునే
కాలానికి గ్రహణం పట్టింది

కమ్ముకొచ్చే మబ్బులను
సైతం  నోట్లతో లిఖించిన
బంధాలు బలపడటంలా

కష్టమొచ్చినా,నష్టమొచ్చినా
బంధాలకు,ప్రేమలకు
నోట్లే మూలము..
అంటుంది నేటి 
అన్నదమ్ముల  అనురాగం..!!


డా.మున్నంగి. రాజకుమారి. కాకాని.
డా.ఆర్.మున్నంగి.ఫౌండేషన్
అధ్యక్షుడు..!!!

Wednesday, 18 March 2020

                         ప్రశాంతం..!!




శాంతం. అనే పదం పురుషుడైతే
ప్రశాంతం.అనే మాట స్త్రీ...

శాంతం  ఆకాశమైతే
ప్రశాంతం భూమి...

ఈ రెండింటిలో ఏదీ లేకపోయినా..
ఎదో శూన్యం  హృదయాన్నీ
ఆవరించి
ప్రాణ నాడులకు స్పందన
లేకుండా చేస్తూ...

ఆ  ప్రశాంతత లేని పురుష జీవితం. 
దాదాపుగా మరణము అంచులదాకా వెళ్లి...

మళ్ళీ ఎదో పూనకం వచ్చినట్టు
తిరిగి  బయట ప్రపంచానికి
కొత్తగా పరిచయం అవ్వాలి
అనుకుంటారు...

శాంతం లేకపోయినా
మనిషికి జీవించటానికి
ముఖ్యమైన ఝరి ప్రవాహం
ప్రశాంతం..!!!


డా.మున్నంగి. రాజకుమారి. కాకాని.

డా.అర్. మున్నంగి ఫౌండేషన్ 
అధ్యక్షులు..!!

                      మనము..!!!






మనం అనేది
ఒక పదం కాదు
కొన్ని కోట్ల మంది
స్పందన
కొన్నివేల ఆలోచనలు
ప్రత్రి స్పందన
మనం అనేది
ఐక్యతకు నిదర్శనం
మన అనేది
అనుబంధానికి
ఆనవాలు
మనం అనే మాటలో
చేరేవాళ్ళు కొందరు
చెడగొట్టే వాళ్ళు
మరి కొందరు.
పెదవి విరిచే వాళ్ళు
కొందరు..
పెదవితో చిరునవ్వు
నవ్వేవాళ్ళు ఇంకొందరు
ఆప్యాయత పంచేది
ఒకరు
అనురాగాన్ని తుంచేది
ఇంకెందరో..
మనం,మన, అనే పదాలకు
అర్థం మారిపోయిన
ఈరోజు ల్లో
మాటలురాన్ని,మాట్లాడలేని
నోరులేనీ.
ఒక పింక్,నీలం నోట్లు
మన అనే అనురాగన్నీ
చెల్ల చెదురు చేశాయి.
మనం అనే పదాన్ని
మర్చిపోయి ఉద్యమాల్లో
బ్రతుకుతూ జీవిస్తున్నాం..!!!


డా.మున్నంగి. రాజకుమారి. కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!!