Saturday, 11 April 2020

             పెళ్ళా....మ్మా


అమ్మా.....?

నీ కష్టాన్ని,బాధ్యతను, నాకు తరతరాల
ఆస్తిగా,ఆభరణముగా  ఇచ్చావా
నా బుజ్జి హృదయాన్ని తట్టి చెప్పావే

బుజ్జి....!

నా బరువు బాధ్యత నీవేననీ
నేను చేసిన పాపమేంటి....?
నేను పుడుతూ  ఏడ్చాను
జీవిస్తూ ఏడుపే
మరణిస్తూ దుఃఖమే

ఎదమ్మా....సుఖం,
బ్రహ్మ మరిచాడా...విధిరాత కాకపోయినా
తల రాతను మార్చుతావని ఆశ పడ్డ
ఆశ ఆవిరై, ఆకాశాన్ని అంట లేదు
భూమిని చేరలేదు

మధ్యలో నీవు రాసిన రాతకు
విలవిలాడాను
అమ్మా....పెళ్లి చేసుకున్నావు బిడ్డను కన్నావు
ఏమి సౌఖ్యం దొరికింది... తల్లి...
జీవితం మారిందా
ఆడ తనపు భావాలు మారాయా
బెదిరింపులు మారాయా...

కష్టాల ఊబిలో నన్ను నెట్టావు
నీవేమి సుఖ పడ్డావు...మాతా..?!

నేను ఎవరికి బరువు
నీకా...సమాజానికా...భూమికా..
చెప్పవే తల్లీ... చెప్పు...

పెళ్లి చేసుకోకపోతే
ఆడ జన్మ మారుతుందామ్మా
అమ్మ తరువాత అమ్మ ,అమ్మమ్మా
ఇదేనా అమ్మా... ఆడ జన్మ..అమ్మరాత
ఆడ జన్మ వాత..

నీ బ్రతుకు శున్య మాసం..
నా బ్రతుకు అమావాస్య  కాళరాత్రి..
ఇవే మన కాళరాత్రి మహమ్మారి
ఆడ జీవితాలు.


డా.మున్నంగి. రాజకుమారి కాకాని
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్ అధ్యక్షురాలు.

No comments:

Post a Comment