Monday, 23 March 2020

 
                                                 

                    ఉమ్మడి కుటుంబం...


నాడు  ..

ఉమ్మడి కుటుంబం
అంటే మమతానురాగాలకు
ఆప్యాయతలకు ప్రేమలకు పుట్టినిల్లు

ధనానికి విలువ ఇవ్వనిరోజులు
ప్రేమలు సమృద్ధిగా ఉన్నరోజులు

సరదా పల్లెటూళ్ళు
సరదా సరదా నవ్వులాటలు
కావాల్సినన్ని కుళ్లు జోక్స్

అవ్వలు, తాతలు 
పిన్నులూ బాబాయ్ లు
ఆమ్మలు  పెదనాన్నలు
అన్నలు తమ్ముళ్లు
అక్క చెల్లెళ్లు ,
బావలు మరదళ్లతో 
పండుగలకు పబ్బాలకు
ఆడుతూ పాడుతూ
కావాల్సినంత కమ్మని నవ్వుతో
ఉమ్మడి కుటుంబాలు ఆహ్లాదకరముగా ఉండేవి 

నేడు..!!



నేడు కుటుంబాలు
ఒంటరి తనంతో 
ఒళ్ళంతా ఒయ్యారాల తో
బిక్కుబిక్కుమంటూ
ప్రక్కటేముకలు 
సలుపుతున్నా బాధ తో
బండబారిన హృదయాలతో
బాధ్యతలు మరిచి 
బంధాలు అదమరిచి
నిద్రిస్తున్నా రోజులు

మమకారాలు అనురాగాలు
తల్లిదండ్రుల పట్ల  ఆప్యాయత
బంధువుల పట్ల అనురాగం
పెద్దలంటే భయభక్తులు
చిన్నలంటే ప్రేమాను రాగాలు 
నేడు  కుటుంబాలు
స్మశానంలో  శవాలైనాయి  

ఎక్కడెక్కడో వెలివేత బ్రతుకులు 
కొండ మీద బండ రాయిలా
మమకారానికి
సమాధి చేసిన రోజులు నేడు


డా.మున్నంగి. రాజకుమారి కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!

No comments:

Post a Comment