Friday, 20 March 2020


                   అక్క  తమ్ముడు..!!!


నాడు..!!



అక్క అంటే 
తమ్ముడికి 
యనలేని మమకారం..

అక్క 
నోటి నుంచి
ఏదైనా మాట
వస్తే బాగుండు

అక్క నేను ఉన్నా
నాకు చెప్పు చేస్తా
అనే తమ్ముళ్లు
ఒకప్పుడు కొకోల్లలుగా
ఉండేవారు..

అక్క ఎంత 
పెద్ద పని చెప్పినా
నా బాధ్యత
అని భుజాలపై
వేసుకునే తమ్ముళ్లు
అన్నాడు..

నీకు ఏ కష్టం
రాదక్క నేనున్నా
అనే రోజులు
ఆనాడు..

తమ్ముళ్లు ఉండేది
అక్క అవసరతలు
తీర్చడానికే

తల్లిదండ్రులు
లేకపోయినా
నా తమ్ముడు అన్ని
తనే అయి చేస్తాడు
అని మురిసిపోయేది
 అక్క

నా అక్కే నా ప్రపంచము
అనుకునే వాడు
ఆనాటి తమ్ముడు

అక్కకు 
కష్టం వచ్చినా
కన్నీళ్లొచ్చినా
భరోసా ఇచ్చేవాడు
అక్కకు వెన్నంటి 
ఉండేవాళ్లు

ఆనాటి తమ్ముళ్లు..!!!

               నేడు..!!



తమ్ముడు అంటే
తుమ్మితే ఊడిపోయే
ముక్కు సామెత.

అవసరతలు తప్ప
ఆప్యాయతలు
అనురాగాలు  లేవు

అక్కకు వెన్నంటి
ఉండాలంటే 
ఎవరుంటారు
నా పనులు నాకు
లేవా అనే తమ్ముళ్లు
ఈ నాడు

ఎవరి అవసరతలు,
ఎవరి పనులు వారికి
వుంటాయి అనే
స్వార్ధ పూరిత మైన
మనసు నేటి తమ్ముళ్లు

నేనేనా నాలాంటి
తమ్ముళ్లు చాలా మంది
ఉన్నారులే
  అని
ఈర్షతో చెప్పే
తమ్ముళ్లు ఈరోజు లల్లో
లేకపోలేదు

స్వార్ధ ప్రపంచంలో
కల్మషమైనా మనసులు
గల తమ్ముళ్లు 
ప్రస్తుత సమాజంలో
లేకపోలేదు

అక్కలకు
మేలు చేసే తమ్ముళ్లు
ఈరోజు లలో
చాలా అరుదనే
చెప్పుకోవాలి

ఏ బంధాలైన 
ఆర్థిక  సంబంధాల తో
ముడి పడుతున్నా
రోజులు నేడు

ఆప్యాయత లు
మమకారాలు 
అనురాగాలు
ఏ నాడో 
భూస్థాపితమైనవీ

అనురాగాల 
ఉయ్యాల లో
ఊగిసలాడుతున్నా
బంధాలు
 నేడు
శున్య మనే చెప్పాలి..!!



డా.మున్నంగి. రాజకుమారి కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!!

No comments:

Post a Comment