Saturday, 21 March 2020

                                                                 
                                                            బాలికలు..
నాడు ..


బాలికలు
పుష్ప వనాలలో
విరబూసే,గుబాలించే
తెల్లనైనా మల్లెలు
గులాబిలు,జాజిలు
చేమంతులు, బంతులు
కనకంబరాలు,లిల్లీలు
మరువం, మాసిపత్రి
పువ్వులు లా,ఆకులు లా
 పరిమళాన్ని వెదజల్లే స్వచ్ఛమైన మనసు.

తల్లిదండ్రి పిలిస్తే 
లేడి పిల్లలా 
పరుగులు పెడుతూ
వచ్చి వాలుతుంది

అమ్మ .........! 
పిలిచావా
ఏదైనా పని చేయమంటావా
అని తల్లి చేతిలో పనిని
తన పనిలా లాగేసుకుంటుంది

పెద్దలంటే గౌరవం తో
చిన్నలంటే మమకారంతో
వరుసైనా వారితో
వయ్యారంగా
తాతలు అవ్వ లతో  
అనురాగంగా, ప్రేమగా
అందరితో కలిసిపోతూ,

కవ్విస్తూ,నవ్విస్తూ
కమ్మని కబుర్లు చెబుతూ
విశాలంగా కావాల్సినంత
సంతోషంగా ఆడుతూ,పాడుతూ
అందరిని అలరిస్తూ
జీవితాన్ని నందన వనం
చేస్తుంది

అమ్మ చెప్పిన విధంగా
బట్టలు వేసుకుంటూ
కాటుక,బొట్టు,పెట్టుకుంటూ
జడలు అమ్మకు నచ్చినట్లు
వేయిoచుకుంటూ

మెడలో గొలుసు 
చేతికి గాజులు
కాళ్లకు పట్టీలు పెట్టుకుని
పుత్తడి బొమ్మలా
బయలు దేరే బిడ్డను
 నా బంగారుతల్లికి
ఏ దిష్టి తగుల కూడదు
అని దీవించి పంపేది

ఆడ పిల్ల అంటే ఇలా
ఉండాలి అనే విధంగా 
ఉంటుంది
నాటి బాలిక...

          నేటి..


బాలికలు  బద్ధకస్తులు
గులాబీ కొమ్మకు ముళ్లులా
ఎప్పుడు ముక్కు మీదే
కోపం తెచ్చుకుంటూ..

చిట పట లాడుతూ
కొరకొర చూస్తూ 
పళ్ళు కొరుకుతూ
గుటకలు వేస్తూ
మేటికలు విరుస్తూ
నన్నే పిలుస్తారు

ఎప్పుడు నేనే
చేయాలా పనంతా
అంటూ  నిట్టూర్పులు
విరుస్తూ జీవిస్తుంటారు

ఇక తాతలు,తండ్రులు పిలిస్తే
ఎప్పుడు నన్నే పిలుస్తారు
ఏమి పని బాట ఏమీలేదు
అనుకుంటూ మనసులో
తిట్టుకుంటూ 
మాటంటే ఏడుస్తూ ..
జీవితాన్ని  వెళ్లదిస్తుంటారు

మమకారాలు
మర్యాదలు ,మౌనాలు
సంతోషాలు  ఇవేమీ
ఉండవు..

స్వార్ధ ప్రపంచములో
సోంబేరుల్లా పెంపకాలు
జరుగుతు దోషాలను
 పెంచుతున్నాము

స్వార్థంగా జీవించమని
చెప్పకనే మీడియా 
ద్వారా చేరవేస్తున్నాం
చూపిస్తున్నాం

ఏంటి అని అడిగితే
మీరు అవసరాలు తీర్చే
యంత్రాలే  అంటున్నారు
నేటి బాలికలు.

మమతలు మమకారాలు
అనురాగాలు ఆప్యాయత
ఇవేమీ లేవు 

వినే స్టేజి పోయి
వివరించే స్టేజి కి
వస్తోంది

ప్రపంచమే స్వార్థం. .
మేము ....స్వార్థమే అంటుంది
నేటి యువత


డా.మున్నంగి. రాజకుమారి కాకాని.
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!


No comments:

Post a Comment