Monday, 16 March 2020

                           ఆగ్రహం...!!!



మరిగే మనసుకు తెలుస్తుంది

హృదయం పడే ఆవేదనేంటో

కంటి పొరలకు తెలుస్తుంది

ఉబికి వచ్చే కన్నీరేమిటో 

చెక్కిలికి తెలుస్తుంది

హృదయ ఘోష ఏమిటో

పిండే గుండెకు తెలుసు


ఆ గుండెలో పుట్టే మంటేమిటో



మస్తిస్కనికి తెలుసు 

సుడులు తిరుగుతు,

 ద్రవిస్తున్నా  మెదడు

మాట వినదని.

ఆగ్రహానికి ఆవేశం

 కట్టలు తెంచుకుంటుంది..

మనిషి మనుగడను 

మార్చేసుకుంటుంది.

మకాం పెట్టెసుకుంటుంది.

ఆ స్థాయికి సమాజం

 తెచ్చేస్తుంటుంది..

మనిషి ప్రవర్తన మారినా,

 మారక పోయిన , 

జనం మాట ,చూసే చూపు 


మనిషి జీవితాన్ని మార్చేస్తాయ్ ...!!!


డా.మున్నంగి. రాజకుమారి కాకాని.
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్
అధ్యక్షురాలు ...!!!

No comments:

Post a Comment