ఊహ..!!!
ఆచరిస్తే మాట
అమలు పరిస్తే పని
ఊహకు శక్తి సన్నగిల్లుతుంది
ఉత్సహనికి సత్తువ ఉరకలేస్తుంది.
ఈ జన్మ బంధమో
గత జన్మ ఋణాను బంధమో
జ్ఞాపకాల యద వెల్లువల్లో
రంకెలేస్తూ జీవన్నీ నింపుతుంటాయే
మాటే కదా ఇస్తే ఏమిటి ఇవ్వకపోతే ఏమిటి
అవసరానికి ,ఆర్భాటాలకి
మాటే పునాదిగా నిలుస్తుంది..
నవ నాడులకు సత్తువనిచ్చి,
మర్చి పోలేని
ఆకాశ నక్షత్రా లను,
పగటిపూట పక్కన పెట్టి
రాత్రి పూట నెమరు వేసుకుంటూ ..
జీవిత పయనాన్ని అంతిమంలా
ఆకాశ మబ్బుల్లా హారతి పడుతూ
కరిగిపోతూ మార్చి
పోతున్నదే ఊహ..!!!
డా.మున్నంగి. రాజకుమారి. కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!!

No comments:
Post a Comment