Sunday, 15 March 2020

అమ్మ..ప్రేమ !!!

             నాడు… !!! 

అమ్మా మమకారం..

మల్లె పందిరి  

జనని అనురాగం

పచ్చని పొలాలల్లో

పైరు పైన హాయిని గొలిపే

కమ్మని  ఔషధమైన వాయువు

తల్లి ప్రేమ...

పచ్చని అడవిలాంటి అమ్మ

ఆప్యాయత కు

ఆనాటి తరమే కాదు ఈనాటి

తరమైనా ఆశ్చర్య పోనవసరంలేదు.

అమ్మ అంటే ఒక పల్లెసీమలో

పుట్టినా. పసందైన పరిమళం…!!!

నేడు…

నేడు మమ్మి అంటే

డమ్మీ నే...

అరచేతిలో  మరయంత్రమనే

మారణహోమాన్ని

చేత పట్టుకొని..

కుటుంబ భారాన్ని బాధ్యత

లేకుండా ఆరచేతిలో ప్రపంచమనే

ఆండ్రాయిడ్ మొబైల్ తో 

దేశ దేశాలు సమాచారంతో 

సర్వనాశనం అవుతుంది

నేటి తల్లి ప్రేమ...

ప్రేమలు దూరమైన  పసి హృదయాలు 

తల్లి మమకారం లేని కుటుంబాలు

నేడు   కోకొల్లలు…!!!



డా.మున్నంగి. రాజకుమారి  కాకాని.

డా.ఆర్.మున్నంగి.ఫౌండేషన్

అధ్యక్షురాలు…!!!


2 comments: