మానవులు..!!
మానవులు అద్భుతమైన సృష్టి
భగవంతుడు ఆనందంలో
చెక్కిన ఒక గొప్ప శిల్పం..
మానవునికి గాలి,నీరు,ఆహారం
అవసరతలు..
అవసరతలు..
మనిషి జీవితం ప్రకృతి మయం
మనిషికి యాదృచ్చికంగా జరిగే
అపాయం..
అపాయం..
జీవితాన్ని ఒక మలుపు తిప్పు
చిన్న దెబ్బతగిలినా..
సెలయెరులా ప్రవహించే రుధిరం..
ఆనందంగా బయటకు పరవళ్లు
తొక్కుతుందేమో...
కొన్ని సంవత్సరాల జీవితంలో
క్రింద పడ్డ రక్తం యెరులై
ప్రవహిస్తుంటే..
క్రింద పడ్డ రక్తం యెరులై
ప్రవహిస్తుంటే..
బ్రతికే మానవుని పరిస్థితి..
ఆలోచనల రూపంలో
అందెలమెక్కుతుంటే
కాలంతో కరుడు కట్టిన మనసు
కాలయాపన
చేస్తానంటుందేమో..
కాలయాపన
చేస్తానంటుందేమో..
గాయమైన తలకు రుధిర ధారలు ప్రవహిస్తుంటే..
మది ద్రవించి పోతుంటే
అపాయానికి ఆనవాళ్ళు
లేని జీవితంలో..
లేని జీవితంలో..
అర్ధాంతరంగా అల్పాయుష్షు
జీవులమౌతున్నాం
జీవితం అనే మారణహోమంలో
సమీదలై కలవరింతలతో ఒకరు,
కౌగిలింతలతో మరొకరు,
మాట మంతితో ఒకరు,
కన్నీటి ధారలతోవేరొకరు
సమీదలై కలవరింతలతో ఒకరు,
కౌగిలింతలతో మరొకరు,
మాట మంతితో ఒకరు,
కన్నీటి ధారలతోవేరొకరు
జీవిత మంత ఎటు చూసినా
శూన్యమే.
అనుభూతులా జ్ఞాపకమే..!!
శూన్యమే.
అనుభూతులా జ్ఞాపకమే..!!
డా.మున్నంగి. రాజకుమారి. కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!!
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!!

No comments:
Post a Comment