Tuesday, 17 March 2020

                    అంతర్లీన  భావన..!!



ఎటు వైపు చూసినా
ఈ రూపమే.
అంతర్లీనంగా దాగిన
భావావేశంలో...

ఒక ప్రమీదలా..
హృదయం పై..ఎప్పుడు
స్పందిస్తూనే...

యద ఘోషలా ..
ఆకాశము నుండి జారిపడిన వర్షపు చినుకులా ...

గవ్వల్లో
రూపు దాల్చిన ముత్యములా 

ఒడ్డుకు చేరిన ముత్యపు చిప్ప
ఎవరికో ఒకరికి దొరికి పోతూంటుంది ..

అదృష్ట వంతులకు ..
ఈ జీవితం అనే నావలో
 చివరి వరకు ప్రయాణించే 
నావ నావికుడు ఎవరో
తెలుసా......?
నీ మనస్సాక్షి.



డా.మున్నంగి. రాజకుమారి. కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!!

No comments:

Post a Comment