Monday, 16 March 2020

                                 భార్య..!!!

నాడు..!!


నాడు భార్య ఆణిముత్యం
అద్భుత దీపము...

అనురాగ  కల్పవల్లి
అవగాహన అంతరంగ వల్లి...

పల్లె సీమలో ఉండే పడుసుదనంలా
పరాయి కొంపకుపోయినా
పరులతో  సఖ్యతే...

ఆనందానికి,సంతోషానికి
 ఆదరించెదానికి,అమృతాన్ని
పంచెదానికి ఇలవేల్పు...

కష్టాలను ఎదిరించే ధీరురాలు..
అన్యాయాలకు మదనపడే
అగ్ని జ్యాల

ఆత్మాభిమానాలకు
అవధులు లేని ఆనందాల విరిబోణి   నాడు భార్య....

భర్తకు చేదోడు, వాదోడుగా
కుటుంబాన్ని చక్కదిద్దే..
మహా మేధవి
అనుభవజ్ఞురాలు

నాటి సతీ శిరోమణి ....

                                        నేడు..!!!



 భార్య  అనురాగాన్ని
ఆప్యాయత ను.
డాలర్స్ లో కొంటుంది..
డైలమాలో పడుతుంది....

ధనవంతుడైతే చాలు..
పొట్టయినా, పొడవైన
నలుపైన ,తెలుపైన.
సాఫ్ట్వేర్ అయినా,
సన్యాసి అయినా డబ్బుంటే..
వాడే మొగుడంతుంది...

మాటకారి అయిన,
మోసకారి అయిన
డబ్బుంటే వాడే మగాడంతుంది
నేటి భార్య....

మొబైల్లో మాట నేర్చుకుంటుంది
నేర్పిస్తుంది
మైమరపిస్తుంది  
మరణహోమము 
చేస్తోంది..చేయిస్తుంది..

మాట్లాడితే ,స్నేహం చేస్తే
పోయేదేముంది
వస్తే డబ్బు,
పోతే పరువు,
ప్రాణం, అంతేకదా..

కుటుంబాన్ని పోషించడంలో
 ఓడిపోతు గెలుస్తూ.
ఆంక్షలు విధించుకుంటు..

ప్రేమలేని జీవితానికి
పరదాకట్టి,గోడపెట్టి
రాజ్యమేలే 
రా రాణినంటుంది..

జీవితాన్ని
అవలీలగా తీసుకుంటుంది
అన్నింటినీ మరుస్తుంది
నేటి మహిళ సతీ మణి..


డా.మున్నంగి. రాజకుమారి. కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!!


No comments:

Post a Comment