అందం..!!
కాళ్లకు నడక అందం
మువ్వన్నె గజ్జలతో..
చేతులకు శ్రమ అందం
గాజుల సవ్వడిలో..
మనిషికి చిరునవ్వు అందం
దయగల చూపుతో...
మమతకు అనుబంధాలు
అందం ఆప్యాయతలో..
శరీరానికి వంపు,సొంపు అందం
ఆహా,ఓహో,అనడంలో..
తలకు కురులందము
పువ్వులతో సొగసుగా..
కళ్ళకు చూపందం
నల్లని దిష్టి చుక్కలాంటి కాటుకతో...
వెళ్లకు రంగు అందం
వెళ్లకు తొడిగే రింగులతో..
శరీరానికి దుస్తులు అందం
దాచుకున్న సౌందర్య సంపదతో..!!
డా.మున్నంగి. రాజకుమారి. కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!!

No comments:
Post a Comment